Saturday, January 11, 2025

అరాచకాలు ఆపకుంటే అంతు చూస్తాం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్!

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఈ మేరకు లేఖ అంటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆయన స్వగ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖను అంటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. బాలానగర్‌, రాజాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నిర్వాహకులను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా యజమానులను బెదిరిచి పట్టాభూములను లాక్కున్నాడని ఆరోపించారు. గతంలో గుడిలో విగ్రాహలు దొంగిలించి ఎక్కడ అమ్మావో మాకు తెలుసన్నారు. ఇకపై ఇలాంటిది తమ దృష్టికి వస్తే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. లచ్చన్నదళం పేరిట ఈ లేఖ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ లేఖపై విచారణ జరుపున్నారు.

స్పందించని ఎమ్మెల్యే
అయితే ఈ లేఖపై ఎమ్మెల్యే ఇంత వరకు స్పందించలేదు. పోలీసులు సైతం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మావోయిస్టల నుంచి లేఖ రావడంపై స్థానిక కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేపై మావోయిస్టులు భూఆక్రమణలు, వసూళ్లు తదితర సీరియస్ ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశాలపై ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నేతలు సైతం ఈ అంశంపై ఎలా రెస్పాండ్ అవుతారన్న దానిపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రంగా చర్చ సాగుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com