Friday, May 16, 2025

ఈ రోజు ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్న కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ పదవికి మరి కాసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‎ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‎ పై బయటికి వచ్చారు. లిక్కర్ స్కామ్ తీవ్ర ఆరోపణలు రావడంతో సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. ప్రజాక్షేత్రంలో తన నిజాయితీని నిరూపించుకున్న తరువాత మళ్లీ సీఎం పదవి చేపడతానని సపధం చేశారు కేజ్రీవాల్. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టబోతున్నారన్నది దేస రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు మంగళవారం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలిసేందుకు కేజ్రీవాల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ కానున్న కేజ్రీవాల్, ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను ఆయనకు అందించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఆప్ కీలక నేతలు, మంత్రులు హాజరైన ఈ కీలక సమావేశంలో కొత్త సీఎం ఎంపిక, కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com