Saturday, October 5, 2024

రాలుతున్న గులాబీ రేకలు

ఇక గులాబీలో మిగిలేది కేసీఆర్ కుటుంబ సభ్యులేనా?
గులాబీ రేకలు రాలిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ బక్క చిక్కిపోతున్నది. నేతల వలసలతో ఖంగుతింటున్నది. ఎంఎల్ఎలు, ఎంఎల్ సీలు   అధికార కాంగ్రెస్ లోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. దీంతో గులాబీ లో ఉండేదెవరు ? వెళ్లే దెవరు ? అన్న అంశంపై  వాడివేడి చర్చ సాగుతోంది. గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎంఎల్ సీలు కాంగ్రెస్ లో చేరిపోగా….శనివారం మరో ఆరో మంది శాసనసభ్యులు కూడా అధికార పార్టీ కుండువ కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున బీఆర్ఎస్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
ఇక మిగిలిన వారు కూడా సాధ్యమైనంత త్వరగా గులాబీ పార్టీకి బైబై చెప్పి….. అధికార పార్టీలో చేరేందుకు  రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే  ఒకరిద్దరు ఎంఎల్ఎల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ప్రత్యమ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఎంఎల్ఎలు, ఎంఎల్ సీలను పూర్తిగా లాగేసి….బీఆర్ఎస్ ను పూర్తిగా కనుమరుగు చేయాలనే విధంగా  సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. దీంతో గులాబీలో కేసీఆర్ కుటుంబం, బంధువులు మాత్రమే మిగిలనున్నారా? అన్న ప్రచారం  సాగుతోంది.
ఇదిలా ఉండగా శుక్రవారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదన్ అధ్యక్షత నిర్వహించిన అత్యంత కీలక సమావేశానికి సైతం ఐదుగురు  ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో  గ్రేటర్ లో సైతం  బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది.  గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో  గ్రేటర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.
వారిలో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తదితరులు ఉన్నారు. వాస్తవానికి ఈ సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోందని సమాచారం అందించారు.  కానీ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సి రావడంతో  సమావేశానికి  హాజరు కాలేదు. ఆయన స్థానంలో తలసానికి బాధ్యతలు అప్పగించారు.  దీని  కారణంగా హాజరు కాలేదా? లేక కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమావేశానికి హాజరు కావాలని ఫోన్లు చేసినా ఈ ఎమ్మెల్యేలు స్పందించలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే పదిమంది కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. దీంతో  మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాలు    గైర్హాజర్ అయిన నేతల వల్ల సాధ్యమయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మెజార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని .. వారి అనుచరులైన కార్పొరేటర్లు కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు. ఒక వేళ అవిశ్వాసం పెట్టినా మజ్లిస్ సహకరిస్తే తప్ప ముందుకు సాగలేరు. మజ్లిస్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది
వరుస షాక్ లు
 బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెప్పగా గురువారం అర్ధ రాత్రి ఒకే దఫాలో ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీని వీడి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. దీంతో పార్టీలో అంతా అయోమయంగా మారింది. పార్టీలో కొనసాగే వారెవరో, వీడే వారెవరో ఎవరికీ అంతు చిక్కడం లేదు.  గురువారం  రాత్రి ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారగా….ఇవాళ తెలంగాణ భవన్ లో అధిష్టానం నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్ కు ఏకంగా  ఆరు మంది ఎమ్మెల్యేలు, పది మందికిపైగా కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీసింది. చేరికలు ఇంతటితో ఆగలేదని త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది.దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
కాగా కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కంటిన్యూ అవుతున్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరికల విషయంలో ఎత్తుకు పై ఎత్తులతో కాంగ్రెస్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. హస్తం పార్టీ వ్యూహానికి కేసీఆర్ అస్త్రాలు పని చేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, మరో ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలోనే బీఆర్ఎస్ వదిలి అధికార పార్టీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మీటింగ్ కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
తగ్గుతున్న మండలి బలం
మండలిలో బీఆర్ఎస్ కు ఉన్న బలం కూడా క్రమంగా తగ్గుతోంది. ఏకంగా ఆరుగు ఎమ్మెల్సీలు ప్లేట్ ఫిరాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోగా, తాజాగా ఎమ్మెల్సీలు కూడా చేరివపోవడంతో ఆపార్టీ మరింత ఇరకాటంలో పడింది.  ఎలాంటి హడావుడి లేకుండా…..చాలా సైలెంట్‌గా ఎమ్మెల్సీలంతా రాత్రికి రాత్రే  కాంగ్రెస్‌లో చేరిపోయారు. వారిలో   భాను ప్రసాద్, బస్వరాజు సారయ్య. దండె విఠల్, ఎంఎస్‌ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్‌ తదితరులు ఉన్నారు.
శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో ఐదారు సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. కీలక బిల్లులను నెగ్గించుకునే రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే వీలుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular