రష్యా, అమెరికా మధ్య మళ్లీ యుద్ధం జరిగే పరిస్థితి ఉందా? అసలు రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా కిమ్ తో ఎందుకు కలిశాడు..? ఉక్రెయిన్ కి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ప్రపంచ యుద్ధం జరగకుండా నిరోధించలేమా? ప్రపంచాన్ని వినాశనం అవుతుంటే ప్రజలు చూసుకుంటూ ఉండాలా? అసలు ఈ అగ్ర రాజ్యాలకు నచ్చ చెప్పేది ఎవరు?..త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న పుతిన్ వ్యాఖ్యలను ఎలా చూడాలి..? ఇప్పుడు ఇవే ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్నలు…
ఉక్రెయిన్‌తో గత రెండు సంవత్సరాలుగా యుద్ధం చేస్తోన్న రష్యా.. తన పంతం నెగ్గించుకునేందుకు ఎంతటి సాహాసానికైనా వెనుకాడబోమని అంటోంది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్.. పలుసార్లు అణు యుద్ధం గురించి కూడా హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు నాటో బలగాలు సాయం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ చెప్తున్న మాట. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఎందుకొస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడే అసలు కథ ఉంది. రష్యా లాంటి పెద్ద దేశాన్ని చిన్న దేశమైన ఉక్రెయిన్ రెండేళ్లుగా బుల్లెట్లు, మిస్సైల్స్ దాడికి తట్టుకుని, ఎదురుతిరుగుతుందంటే దానికి అగ్రరాజ్యం అమెరికానే కారణం. ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు సహకరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఈ దేశాలపై గుర్రుగా ఉన్న పుతిన్ తాజాగా… నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ తో దోస్తీ కట్టాడు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు అగ్రరాజ్యంపై కోపంతో పుతిన్, కిమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. విందు భోజనాలు, కారులో షికార్లు, రిటర్న్ గిఫ్ట్‌లతో… దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ మాట వినని చిన్న దేశాలపై ఆయుధాలతో విరుచుకుపడుతూ యుద్ధం చేస్తున్నారు. మరోవైపు కిమ్ ఏకంగా ఎప్పటికప్పుడు మిస్సైల్స్ ప్రయోగం చేస్తున్నారు. అమెరికా లాంటి అగ్రదేశాలు హెచ్చరిస్తున్న వెనకడుగు వేయడం లేదు. ఈక్రమంలో ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దోస్తీ కుదరడం… బాయ్ బాయ్ అంటూ కలిసి తిరగడం ప్రపంచ దేశాలను భయపెడుతుంది. మరి ముఖ్యంగా అగ్ర దేశమైన అమెరికాలో ఆందోళనకు కారణం అవుతుంది.
అమెరికాకు చెక్ పెట్టాలని వీరు సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచదేశాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పుతిన్ కామెంట్స్, కిమ్‌తో దోస్తీ లాంటి పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని ఆందోళన చెందుతున్నారు ఎంతో నిపుణులు.
ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత పశ్చిమ ఆసియా దేశాలతో రష్యా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఓవైపు.. రష్యా దేశం, మరోవైపు పశ్చిమా ఆసియా దేశాలకు వైరం కొనసాగుతోంది. గత నెలలో త్వరలో ఉక్రెయిన్‌లో నాటో సైనిక దళాలను మోహరించడాన్ని తాను తోసిపుచ్చలేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కామెంట్స్.ను .. ఐరోపాలోని పలు దేశాలు సమర్థించాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌తో ఆయుధ ఒప్పందం చేసుకున్నాడు పుతిన్. మొత్తం మీద ఉక్రెయిన్ విషయంలో తగ్గేదే లే… అవసరమనుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికైనా సిద్ధమేనంటున్నాడు.