Friday, May 9, 2025

ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది. సరిహద్దుల్లో పాక్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారం కల్పించింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెగ్యులర్‌ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది.
సైనిక రిజర్వ్ ఫోర్స్‌గా టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంటుంది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలయ సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రత విధులకు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com