-
కేరళ వరద సహాయక చర్యల్లో ఆర్మీ శునకాలు
-
మట్టిదిబ్బల్లో ఉన్నవారి శ్వాసను పసిగట్టే నైపుణ్యం
కేరళను భారీ వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.మరీ ముఖ్యంగా వయనాడ్ సమీపంలోని చూరాల్‌మల, ముండక్కాయ్ గ్రామాలను వరదలు అతలాకుతలం చేశాయి.రెండు రోజుల క్రితం ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తడంతోకొండచరియలు కూడా విరిగిపడడ్డాయి. ఆ రాళ్లు, వరద, బురద అంతా కింద ఉన్న ఊళ్లను ముంచెత్తింది.
చుట్టూ పేరుకు పోయిన బురద, బండరాళ్లు, భయానక వరద ప్రవాహంలోనేలమట్టమైన ఇళ్లు, భవనాలే కనిపిస్తున్నాయి. వేర్లతో సహా పెకిలించుకొని కొట్టుకొచ్చినభారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు. వరదల్లో కొట్టుకొచ్చి మేటవేసిన కార్లు, బైకులు, వాహనాలేదర్శనమిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయిన మనుషులు ఎక్కడున్నారో తెలియని అయోమయ పరిస్థితులునెలకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ సుమారు 180 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు.సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి దాదాపు 481 మందిని కాపాడాయి.
సమీప ప్రాంతాల్లో కొండచరియల కింద, శిథిలాల కింద ఇంకాచాలా మంది చిక్కుకొని ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రుల్లో గాయాలైనవందలాది మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారు.అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శిథిలాల కిందవందల సంఖ్యలో చిక్కుకున్నారు. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో శిక్షణ పొందిన ఆర్మీ శునకాలను కూడా రంగంలోకిదింపారు. లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన స్నిఫర్‌డాగ్ లను తీసుకొచ్చారు. ఇవి మానవ అవశేషాలతో పాటు మట్టిలో కూరుకుపోయిన వారి శ్వాసనుకూడా పసిగట్టగలవు. వీటి సాయంతో మట్టి దిబ్బల్లో కూరుకుపోయిన వారి ఆచూకి తెలుకునేందుకుప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. సాధ్యమైనంత త్వరగా కనిపించకుండా పోయిన వారందరినిగుర్తిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.