Saturday, September 21, 2024

హుస్సేన్‌సాగర్‌లో చెత్త, పూజా సామగ్రి ఏరివేతకు ప్రత్యేక సిబ్బంది, యంత్రాలను ఏర్పాటు చేసిన హెచ్‌ఎండిఏ

ట్యాంక్‌బండ్‌లో వేసే వ్యర్ధాలను, ప్లాస్టిక్ కవర్లు, పూజా సామగ్రి, నీటిలో ఉన్న డెబ్రీస్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు హెచ్‌ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రెయిన్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు హెచ్‌ఎండిఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డీ చంద్రారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా డెబ్రీస్ తొలగించేందుకు 14 మోడ్రన్ మిషన్‌లను అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో పెద్ద ఎఫ్టీసి యంత్రాలను నాలుగింటిని ఏర్పాటు చేశామని, మిగిలినవి చిన్న మిషన్‌లని ఆయన తెలిపారు. సందర్శకులు, నిమజ్జనం కోసం తీసుకు వచ్చిన పూజా సామగ్రితో పాటు టాంక్‌బండ్‌లోకి విసిరేసిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు సిబ్బంది తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో హెచ్‌ఎండిఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular