2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ (AI) కు పెద్ద పీట వేశారు. దీంతో పాటూ ఆనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ‘‘బీమా రంగంలో FDIలు 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే AI అభివృద్ధికి రూ.500 కోట్లతో 3 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అంటూ నిర్మలమ్మ ప్రకటించారు.
‘‘చిన్నస్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నాం. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనలు సులభతరం చేయనున్నాం. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. త్వరలోనే జనవిశ్వాస్ 2.O బిల్లున ప్రవేశపెట్టనున్నాం’’.. అంటూ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.