తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలని నెక్స్‌ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు శర్వా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో శర్వా మాట్లాడుతూ.. కొన్ని కొన్ని సినిమాలు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మంచి వాటంత అదే జరిగిపోతుంది. ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది. సంపత్ నందితో ఏడాదిగా ట్రావెల్ చేస్తున్నాను ఆయన ఒక అడిక్షన్. తమన్నా ఆయనతో నాలుగు సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. తమన్నాని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు తను వండర్‌ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా ఉండడం మామూలు విషయం కాదు. ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఎందుకో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. కొన్ని సినిమాలు కి ఆడియన్స్ డెఫినెట్ గా చూడాలని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఓదెల 2 కూడా అలాంటి సినిమానే. ఈ సినిమాకి నేను వెళ్తాను. ఆడియన్స్ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యారని నమ్ముతున్నాను. మధుకి టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు నచ్చింది సౌందర్ రాజన్ విజువల్స్. మంచి సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్ కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. విష్ యు ఆల్ ది బెస్ట్’అన్నారు.