బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా చెలామణి అవుతూ.. ఆయన కోటరీలో కీలకంగా వ్యవహరించే అరవింద్ అలిశెట్టి అనే బీఆర్ఎస్ నేతను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ పేరును ఉపయోగించుకుని.. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడీ ప్రబుద్ధుడు. తెలంగాణ ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ ఇప్పిస్తానని నాలుగు కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మిడ్ డే మీల్స్ పేరిట అరవింద్ అలిశెట్టి ఏకంగా ఫేక్ ప్రభుత్వ జీవో జారీ చేశాడని తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. అతను చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఇలాంటి అలిశెట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు? వారందరి పేర్లు అతిత్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.