Tuesday, April 15, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్

టీఎస్ న్యూస్ : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించిన సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో సీఎం కేజ్రీవాల్‌ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రేపు (శుక్రవారం) ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ నిలువరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com