Thursday, May 8, 2025

నిర్మాతగా మొదటి శుక్రవారం ఆ కష్టం ఎలా ఉంటుందంటే?

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో సమంత మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. నటిగా నేను ఎంతో చూశాను. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైంలో చాలా ఆలోచించాను. హీరోయిన్‌గా నేను ఏ సినిమాలు చేయలేకపోయాను. అసలు ఇక సినిమాల్లో నటిస్తానో కూడా తెలియని సమయంలో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది. నటించకపోతేనేం సినిమాలు నిర్మించొచ్చు కదా అని అనుకున్నాను. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు ఇంత అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించాం. 8 నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com