కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి మల్లు రవి
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణను వాయిదా వేయడానికి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి మల్లు రవి ప్రకటించారు. కాగా, వచ్చే నెలలో జరగనున్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడంతో పాటు గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులు.ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు.
నిరుద్యోగులతో ప్రభుత్వం తరుఫున సీనియర్ ఎంపిలు మల్లు రవి, బలరాం నాయక్ చర్చలు జరిపారు. అభ్యర్థులతో చర్చలు ముగిసిన అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు అనంతరం నిరుద్యోగులు మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్ష వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందని వారు తెలిపారు. డిసెంబర్ నెలలో గ్రూప్-2 నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించిందని వారు వెల్లడించారు. గ్రూప్-2 పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు పేర్కొన్నారు.