Saturday, April 26, 2025

అసలు గొడవ ఇక్కడ మొదలైందా…?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా, అల్లు కుటుంబాల్లో ఎక్కడో కోల్డ్‌ వార్‌ నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు అంతా ఒకేలా కలిసి ఉన్న ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు మాత్రం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణం నాడు జరిగిన ఆ సంఘటనే అని అందరూ అంటున్నారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి కూడా గొప్పగా మాట్లాడే అల్లు అర్జున్ మొదటిసారి రివర్స్ అయిన ఘటనను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోతూ అంటే అతిశయోక్తి కాదు. చెప్పను బ్రదర్.. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతున్న తరుణంలో చాలామంది పవన్ కళ్యాణ్ పేరును మాట్లాడమని ప్రస్తావించారు. అప్పటికే చాలా ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవర్ స్టార్, పవర్ స్టార్ అని అరవడం అలవాటుగా మారిపోయింది. ఇక దీంతో అల్లు అర్జున్ డైరెక్ట్ గా స్టేజ్ పైన చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ అనేశారు. ఇక్కడతో పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ కాస్త, అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనుకునే స్థాయికి వెళ్లిపోయాయి. నేటికీ ఈ ఇష్యూ జరిగి తొమ్మిదేళ్లు కావడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ కి కౌంటర్ గా మరో ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ సైతం పవర్ స్టార్ , మెగాస్టార్ అంటూ కౌంటర్స్ ఇచ్చారు. అప్పటి నుంచి చాప కింద నీరులా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం గత ఎన్నికల సమయంలో భగ్గుమంది. ఆ మంటలు ఇప్పటికీ ఆరకుండా సోషల్ మీడియాలో సైతం ఒకరికి మరొకరు అన్ ఫాలో చేసుకునేంత వరకు వచ్చింది. ఏపి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్లడంతో.. దానిపై నాగబాబు రియాక్ట్ అవుతూ.. ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడుమా వాడైన పరాయి వాడే.. అనే పోస్ట్ మరింత ఆజ్యం పోసింది. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ అయితే.. ఏకంగా అల్లు అర్జున్‌ను ట్విట్టర్‌లో అన్‌ ఫాలో కొట్టాడు. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత, ఇటీవల మాట్లాడుతూ.. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అల్లుఅర్జున్ ఇండైరెక్ట్‌గా ఈ వ్యవహారానికి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. మన ఫ్రెండ్ అనుకో.. కావాల్సిన వాళ్లనుకో.. నాకిష్టమైతే నేనొస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా.. అన్నారు.
అయితే.. సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ.. మెగా, అల్లు కాంపౌండ్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కదా.. సమయం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మధ్య కొట్లాటకు దారి తీసేలా కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. ఇలా రోజు రోజుకి మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు.. అభిమానుల మధ్య మాటల యుద్ధం పెరుగుతునే ఉంది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com