Thursday, September 19, 2024

పదేళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు

సరిగ్గా పదేళ్ల తరువాత జమ్ముకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో ఈ రోజు మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 24 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌ లో 16, జమ్ములో 8 స్థానాల్లో మొత్తం 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నికల నేపధ్యంలో భారీ భధ్రతను ఏర్పాటు చేయగా.. ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్లను అదనపు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పహారా కాస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), పీపుల్స్ కాన్ఫరెన్స్, ఇతర పార్టీలు స్వతంత్రంగా బరిలోకి దిగాయి. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మొదటి దశలో జరుగుతున్న ఎన్నికల్లో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీల భవితవ్యం తేలనుంది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ సైతం మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్ముకశ్మీర్‌ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా.. మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 వరకు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular