Tuesday, May 6, 2025

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌ మ‌య్యాయి.. ఇవాళ మ‌రో 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. నిన్న 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌భ‌.. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు స‌భ కొన‌సాగింది.

ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌భ్యుల‌కు కీల‌క సందేశం ఇచ్చారు. నిన్న‌టి లాగా సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌ని స‌భ్యుల‌కు స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి స‌భ్యుడికి 15 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తామ‌న్నారు. స‌భ్యులంద‌రూ స‌బ్జెక్ట్‌ పైనే మాట్లాడాల‌ని స‌భాప‌తి స‌భ్యుల‌కు సూచించారు.

ఇవాళ వ్య‌వ‌సాయం, స‌హ‌కార‌, నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్లు, గృహ నిర్మాణం, పౌర స‌ర‌ఫ‌రాలు, ప‌శు సంవ‌ర్ధ‌క‌, ప‌ర్యాట‌క‌, క్రీడా శాఖ‌, అట‌వీ, దేవాదాయ‌, మైనార్టీ, చేనేత‌, స్త్రీ శిశు సంక్షేమ ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com