Thursday, December 26, 2024

అసెంబ్లీ వాయిదా

తెలంగాణ శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. ప‌ర్యాట‌క విధానంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ అనంత‌రం స‌భ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. బీఆర్ఎస్ స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే రాష్ట్ర పర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను స‌భ‌కు వివ‌రించారు.
విరామం అనంత‌రం ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఈ అంశంపై చ‌ర్చ‌కు బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. కానీ స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, స్పోర్ట్స్ వ‌ర్సిటీ బిల్లు, విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను సంబంధిత మంత్రులు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇక ఈ బిల్లుల‌పై ఎలాంటి చ‌ర్చ చేప‌ట్ట‌కుండా.. శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. అయితే ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేశారు. ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగ‌ల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాల‌తో హోరెత్తించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com