తనను కండోమ్స్ తీసుకురమ్మని బలవంతం చేశాడంటూ కోలీవుడ్ హీరో నఖుల్ పై అసోసియేట్ డైరెక్టర్ చంద్రు సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కండోమ్స్ తీసుకురావాలని నఖుల్ తనను బలవంతం చేశాడని చెప్పాడు. దీనికి తాను ఒప్పుకోకపోవడంతో తనను ఇబ్బందులకు గురిచేశాడని.. తనకు రెండేళ్ల జీతం రాకుండా అడ్డుకున్నాడని చెప్పాడు. అంతేకాదు.. తన గురించి డైరెక్టర్ వద్ద తప్పుడు మాటలు చెప్పి.. ఆ సినిమా నుంచి తొలగించాడని ఆరోపించాడు. ఈ ఘటన వాస్కోడగామా సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిందని చంద్రు తెలిపాడు.
కాగా.. నఖుల్, డ్యాన్సర్ గా తమిళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2003లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన “బాయ్స్” మూవీలో నటించాడు. అనంతరం పలు తమిళ చిత్రాలలో నఖుల్ నటించారు.