ఆ రోజు భూమిని ఢీకొట్టే అవకాశం
అంతరిక్షంలో ఓ నిర్ధిష్టమైన గమ్యం లేకుండా తిరిగుతున్న గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ- నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు నాసా ప్రకటించింది.
ఈ శకలం పరిమాణం ఎంత అనేది మాత్రం ఇంకా తెలియదని, భూమిని ఢీ కొట్టే ముప్పు 72 శాతం ఉందని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలం 2038 జులై 12న భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఉందని చెబుతోంది సానా. గ్రహ శకలానికి సంబందించిన ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని తెలుస్తోంది.
అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం నాసా శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ విధానం ద్వారానే ఈ గ్రహ శకలానికి సంబందించిన ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు.
గత ఏప్రిల్ లో బైనియల్ ప్లానిటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సెర్ సైజ్ నిర్వహించింది నాసా. సమీప భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పులేకున్నా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రహశకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తం అయ్యేందుకే ఈ ఎక్సెర్ సైజ్ చేపట్టినట్లు స్పష్టం చేసింది.