Friday, November 15, 2024

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నట్లుగా సమాచారం.
కేజ్రీవాల్ ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. దీంతో, తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే.. ఆప్ నేత అతిషీ ని సీఎం పీఠంపై కూర్చో బెడుతుండటం గొప్ప విషయంగా చెప్పవచ్చు..
మన దేశంలో చాలా పార్టీలు, కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీకులే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో చాలా మంది నేతల ఉన్నారు.
కానీ, కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్య కాకుండా.. పార్టీలో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం.. నేడు మధ్యాహ్నం 4.30 గంటలకు రాజ్ నివాస్ లో అతిషీ.. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు..
ఆమెతో పాటు మరో ఐదుగురు ఆప్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాక పోవడంతో.. అతిషీ ని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు.
ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిషీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
అయితే, ఈ కార్యక్రమం సాదాసీదాగా సాగి పోనుంది. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి అవ్వడం కంటే ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు బాగలేక పోవడం ప్రధాన అంశంగా చెప్పవచ్చు.
కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఆప్ నేతలకు నచ్చలేదు. మన సమయం బాలేదు ఆర్భాటాలు  చేయకూడదు అనుకుంటూ సర్ధుకు పోతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular