Friday, April 18, 2025

హైదరాబాద్ లో దారుణం- స్నాప్‌చాట్‌లో యువతి నగ్న వీడియోలు

సమాజంలో రోజు రోజుకు నేరాలు-గోరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న పిల్లలు సైతం చెడు మార్గం పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓ మైనర్ యువతి నగ్న వీడియోలు సేకరించి స్నాప్‌ చాట్‌ లో ఇతరులకు షేర్‌ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ తలాబ్‌ కట్ట ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అఖీలుద్దీన్‌ స్థానికంగా ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఒక బాలికతో పరిచయం ఏర్పడింది. కొన్నిరోజుల తర్వాత బాలికకు స్నాప్‌ చాట్‌ ద్వారా వీడియో కాల్‌ చేసి ఆమె వ్యక్తిగత, నగ్న వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ వీడియోలను స్నాప్ చాట్ లో స్నేహితులకు పంపించాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో యువతి అవాక్కైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో అఖీలుద్దీన్‌ పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com