Wednesday, April 9, 2025

మహారాష్ట్రలో దారుణం- 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

దేశంలో రోజురోజుకు అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా దారుణాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా కామాంధుల అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. మహారాష్ట్రలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటన పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు మైనర్ బాలికను సెప్టెంబర్ 2వ తేదీన తెల్లవారుజామున నల్లా సోపారా లోని ఏకాంత ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

దీంతో బాలిక తల్లి సెప్టెంబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులుషాహు అలియాస్ లంబు (35), రాహుల్ గెండే (41) లపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిననట్లు పోలీసులు చెప్పారు. ఐతే అత్యాచారం జరిగిన నాలుగు రోజుల తరువాత బాలిక తల్లి ఎందుకు పిర్యాదు చేసిందన్న విషయాన్ని పోలీసులు చెప్పలేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com