కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #సింగిల్‌తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మే 9న సింగిల్ సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కొత్త కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంటర్వెల్ క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి. అన్ని సన్నివేశాలు కూడా మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. యంగ్‌స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. మేము అనుకున్నది స్క్రీన్ మీదకి చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.
డైరెక్టర్ కార్తీక్ రాజుతో నాకు టూ ఇయర్స్ ట్రావెల్ ఉంది. చాలా మంచి టీం తో కలిసి సినిమా చేశాం. సినిమా చూసి అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు.. ఫైనల్ అవుట్ చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది?
కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్‌టైనర్ అవుతుందని అనిపించింది.
టైటిల్ సింగల్ అన్నారు.. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు?
చాలా కొత్త క్లైమాక్స్ ఇది. అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం హైదరాబాద్ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం.
వెన్నెల కిషోర్ క్యారెక్టర్ గురించి?
మా ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ లేకపోయినా ఈ సినిమా లేదు. సినిమా చూసిన తర్వాత అది మీకే అనిపిస్తుంది. కిషోర్ వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టుని 100% చేస్తున్నామని భావించాం.
మీరు ఒక క్యారెక్టర్ కి ఒక క్యారెక్టర్ కి ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్ ని ఎలా చూస్తారు?
నేను ప్రతి క్యారెక్టర్ నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్ లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.
మీరు డైలాగ్స్ లో సపరేట్ గా ఒక డిక్షన్ సృష్టించుకున్నారు.. దానికోసం ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు?
ముఖ్యంగా యంగ్‌స్టర్స్ ఆ డైలాగ్ డిక్షన్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను సపరేట్ గా కేర్ తీసుకుని చేస్తున్నాను. వీలైనంతవరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనేది నా ఉద్దేశం.
నిర్మాతల సపోర్ట్ గురించి?
షూటింగ్ జరుగుతున్నంత సేపు చాలా కంఫర్ట్ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా చాలా కేర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ చాలా అనుభవం ఉంది. కాబట్టి అంతా ఈజీగా జరిగింది.
ఈ సినిమాలో మీ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుందా?
అవునండి. ఇది ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ లో ఉన్న ఫ్రెష్నెస్ బాడీ లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు.
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి?
సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు ఆయన ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది
– వేల్ రాజ్ సూపర్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ ని చాలా కొత్తగా చూశారు. ఆ కొత్తదనం ఆడియన్స్ స్క్రీన్ మీద చూడబోతున్నారు.
ఏదైనా ఒక స్టైల్ కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా.. ఫ్యూచర్లో ఒక కొత్త స్టైల్ ని పట్టుకోవడానికి మీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం చేస్తుంటారు?
నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్‌ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను.
స్వాగ్ సినిమా విషయంలో ఎలా ఫీలవుతున్నారు?
సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను.