సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ హీరోహీరోయిన్‌కు డ్రీమ్ రోల్, డ్రీమ్ డైరెక్టర్ అనేవారు ఉంటారు. ఆ డ్రీమ్ డైరెక్టర్‌తో పనిచేయడం కోసం, వారి సినిమాలో నటించడం కోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధమవుతారు. ఇక సీనియర్ హీరోయిన్ ప్రిమయణికి కూడా అలాంటి డ్రీమ్ డైరెక్టర్ ఉన్నారని తాజాగా బయటపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్లో కూడా బిజీ అయిపోయింది ప్రియమణి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తాజాగా తన ఫేవరెట్ డైరెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ 3వ సీజన్‌ను చూడడానికి నేను కూడా ఎదురుచూస్తున్నాను. నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఈ సీజన్ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీజన్ 3 కోసం ఎదురుచూస్తూ ఉండండి. ఇందులో మీరు ఊహించనివి చాలా జరుగుతాయి’’ అంటూ ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేసింది ప్రియమణి.
ఫోన్ రావడమే ఆలస్యం
తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం అని చెప్తూ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో ‘రావనన్’ అనే మూవీలో నటించింది ఈ సీనియర్ బ్యూటీ. ఆ మూవీ హిందీ వర్షన్ అయిన ‘రావన్’లో కూడా మళ్లీ అదే పాత్ర చేసింది. దాని గురించి మాట్లాడుతూ.. ‘‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను మణి సార్ సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఆయన దర్శకత్వంలో ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా ఓకే చెప్తానంటోంది.