తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి కర్మాగార భవనంలోని కొన్ని గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విరుద్‌నగర్‌లోని సాయినాథ్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధాలు వినిపించాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, శిథిలాల కింద ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రసాయనాలను కలిపే ప్రక్రియలో పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.