Wednesday, November 6, 2024

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్!

మాజీ మంత్రి బాబు మోహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరారు. ఆందోల్‌ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లుగా బాబు మోహన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కేఏ పాల్ అప్పగించారు. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీలో పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు తెలంగాణపైన ఫోకస్ పెట్టారు. తెలంగాణలోనూ పార్టీకి ఒకప్పటి వైభవం తీసుకురావాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే పలువురు కీలక నేతలతో ఆయన ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి లాంటి నేతలు త్వరలో టీడీపీలో చేరుతామని ఓపెన్ గానే చెప్పేశారు. ఇప్పుడు బాబు మోహన్ కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీలో సుధీర్ఘంగా పనిచేసిన బాబు మోహన్ కు పార్టీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశారు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు.

2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయారు. 2023 ఫిబ్రవరి 7న బీజేపీకి రాజీనామా చేసి అనంతరం మార్చి 04న ప్రజా శాంతి పార్టీలో చేరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular