ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని తమ స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది మెట్ గాలాలో పలువురు భారతీయ తారలు కూడా సందడి చేశారు. ముఖ్యంగా, బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైన కియారా అద్వానీ, మెట్ గాలా వేడుకలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన గౌనులో ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే, ఈ సందర్భంగా కియారా బేబీ బంప్‌తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొంతకాలంగా ఆమె గర్భవతి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మెట్ గాలా వేదికపై బేబీ బంప్‌తో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రియాంక చోప్రా కూడా తన భర్త, పాప్ సింగర్ నిక్ జోనస్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే, ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ తనదైన పంజాబీ రాయల్టీ స్టైల్‌లో మెట్ గాలాలో ప్రత్యేకంగా నిలిచారు.