టాలీవుడ్ అగ్రనటిగా కొన్నేళ్ల పాటు కొనసాగిన సమంత ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నటిగా ఆమె ఎంతో బిజీగా ఉంటోంది. తాజాగా సమంతకు చెందిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనపడుతోంది. దీంతో ఈ ఫొటోలను చూస్తున్న నెటిజన్లు, అభిమానులు షాక్ కు గురవుతున్నారు. తనకు మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని గతంలో సమంత చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో, తన కలను ఆమె నెరవేర్చుకుందా? అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే… సమంత నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ఎవరో ఈ ఫొటోలను ఏఐని ఉపయోగించి క్రియేట్ చేశారు. సమంత ప్రెగ్నెంట్ అని గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఇలా ఒక స్టార్ హీరోయిన్‌ని ఇలాంటి టెక్నాలజీ వాడి వారి ఫొటోలను అనవసరంగా వాడితే ఇలాంటి వాటి పై కూడా చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.