కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో.. నగరంలోని కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడి ఆరంభమైంది. బాచుపల్లిలోని కెన్నెడీ స్కూల్ తాజాగా 20 శాతం ఫీజు పెంచిందని తెలిసింది. ప్రైమరీ స్కూలు చదివే విద్యార్థులు ఇక నుంచి సుమారు రెండున్నర లక్షల దాకా కట్టాలీ స్కూలులో. సీబీఐటీ వంటి కళాశాలలోనే ఇంజినీరింగ్ కోసం లక్షా అరవై ఐదు వేల రూపాయలు ఫీజుంటే.. కెన్నెడీ స్కూలులో 3-5 తరగతి చదివే విద్యార్థులు ఎంతలేదన్నా రెండున్నర లక్షల రూపాయలు కట్టాల్సి వస్తోంది. మరి, ఇలా ఇరవై శాతం చొప్పున ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గాడియం, చిరెక్, ఒక్రిడ్జ్ వంటి స్కూళ్లో అయితే ప్రైమరీ స్కూల్ చదువు కోసమే 5 నుంచి 8.5 లక్షలు దాకా ఫీజులు వసూలు చేస్తున్నారని సమాచారం.