ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 23 నెలల తరువాత విజయ్ నాయర్ కు బెయిల్ మంజూరు అయింది. ఆమ్ అద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ ఛార్జి అయిన విజయ్ నాయర్ మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నారు. తన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం విజయ్ నాయర్ కు బెయిల్ మంజూరు చేసింది. విజయ్ నాయర్ తరుపున అభిషేక్ మనూ వాదనలు వినిపించారు. కాగా 2022 నవంబర్ 13వ తేదీన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు.