Wednesday, November 27, 2024

బెయిల్.. ఇప్పుడే ఇవ్వలేం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో పోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురవుతూనే ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి ప్రతీసారీ నిరాశే మిగులుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి తిరుపతన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అదనపు ఎస్పీ తిరుపతన్న సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం కౌంటర్‌ దాఖలుకు రెండు వారాల సమయం ఇస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్‌ 18వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు బెయిల్‌ పిటిషన్‌ విచారణ చేయలేమంటూ వెల్లడించింది.
ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తిరపతన్నకు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం (అక్టోబర్ 24న) న్యాయస్థానం విచారణ చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి మూడు నెలలు అయిన తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని ధర్మాసనం ప్రశ్నిస్తూ.. తరుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. దానిలో భాగంగా బుధవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు తదుపరి డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు ఇటీవల హైకోర్టు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించింది. తిరుపతన్న ఫోన్‌ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే… దాన్ని వల్ల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేయాలని ఖాకీలను కోర్టు ఆదేశించింది. అలాగే తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేస్తూ.. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంను ఆశ్రయించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular