ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ గ్రీన్ ఎనర్జీ వాహనాలపై దృష్టి పెట్టి సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నది. ఇటీవల లాంచ్ చేసిన సీఎన్‌జీ బైక్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో మోటార్ సైకిల్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇథనాల్ వేరియంట్‌లో చేతక్ మోడల్‌ని పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మోడల్‌పై ఇప్పటికే బజాజ్ ఆటో సీఈవో రాజీవ్ బజాజ్ ఓ ఇంటర్వ్యూలో కీలక ఆ్యఖ్యలు చేశారు. అద్భుతమైన ఫీచర్స్‌తో వస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బజాజ్ మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.
ఈ క్రమంలో కంపెనీ నెంబర్ వన్‌గా నిలిచింది.
కంపెనీ త్వరలోనే వచ్చే నెలలో ఇథనాల్‌తో నడిచే బైక్‌లతో పాటు ఆటోలను ప్రదర్శించనున్నట్లు సీఈవో పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వీటిని లాంచ్ చేయనున్నది. ఇథనాల్‌తో నడిచే చేతక్ అద్భుతమైన ఫీచర్స్‌తో 2025 సంవత్సరం ప్రారంభంలో కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆటోలను సైతం సరికొత్త మోడల్‌లో పరిచయం చేయబోతున్నట్లుగా టాక్. బజాజ్ 2025 నాటికి నెలకు లక్ష గ్రీన్ ఎనర్జీ బైక్‌లు, ఆటోలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఉత్పత్తిని సైతం ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీకి చెందిన ఇతర వాహనాల విక్రయాలు పెరిగాయని సీఈవో పేర్కొన్నారు.
అంతేకాకుండా వచ్చే సీజన్‌లో లక్ష క్లీన్ ఎనర్జీ వాహనాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే బజాజ్ ఫ్రీడమ్ – 125 రెండు కిలోల సిఎన్‌జి సిలిండర్ వేరియంట్‌లో విడుదల చేసిందని.. త్వరలోనే మరిన్ని బైక్‌లను లాంచ్ చేస్తామని సీఈవో ప్రకటించారు. ఆగస్టులో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్‌లను కంపెనీ 8వేల నుంచి 9వేల మధ్య విక్రయించినట్లు తెలిపారు. వచ్చే జనవరి వరకు వీటిని 40వేల వరకు డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాదిలో ఈ -రిక్షాను కూడా అందుబాటలోకి తీసుకరాబోతున్నట్లు వెల్లడించారు. బజాజ్ చేతక్ లాంచ్ అయితే బజాజ్ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్‌తో పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.