Sunday, October 6, 2024

నియామ‌కాల‌పై బ‌క్క జ‌డ్స‌న్ ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష‌

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే బ‌క్క జ‌డ్స‌న్ నియామ‌కాల‌పై ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష‌ను ఆరంభించారు. పాత ప్ర‌భుత్వం అనుస‌రించిన వైఖ‌రిని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుక‌రిస్తోంద‌ని విమ‌ర్శిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ లేఖ‌ను రాశారు. నియామ‌కాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం తీసుకోవాల్సిన నిర్ణ‌యాల్ని లేఖ‌లో ప్ర‌స్తావించారు. మ‌రి, ఆయ‌న ప్ర‌భుత్వానికిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లేమిటంటే..

నీళ్ళు నిధులు నియామకాలు కోసం తెలంగాణ యువత పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ఉద్యోగాల కోసం గత పది సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని బస్సు యాత్ర ద్వారా ప్రతి ఊరికి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చి పెట్టడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరునే మీరు కూడా అనుసరిస్తున్నారు. ఏ అధికారి అయితే ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా పోషించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానపరిచిండో ఫోన్ టాపింగ్ జరిగినప్పుడు ఎవరైతే డీజీపీగా ఉన్నారో ఆ అధికారిని తీసుకొని వచ్చి TGSPC చైర్మన్గా నియమించారు. అతని నియమకాన్ని పౌర సమాజం వ్యతిరేకించింది అయినా కూడా అతన్ని నియమించారు.

తెలంగాణలోని నిరుద్యోగులు

1. మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.

2. గ్రూప్-2లో 2000, గ్రూప్-లో 3000 ఉద్యోగాలు కలపాలి.

3.25వేల పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి – TET నార్మలైజేషన్ చేసి ఆఫ్ లైన్ లోపరీక్షలు పెట్టాలి.

4. గురుకులంలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి వారి హక్కుల కోసం పోరాడుతుంటే ఇటు TGPSC అటు మీరు గాని మొండిగా వ్యవహరిస్తున్నారు.

5. 46 GO రద్దు చేయాలి.

ఈ సమస్యలు పరిష్కరించకుండా మీ మొండితనానికి విసుకు చెందిన నిరుద్యోగుల తరఫున ఏ అగత్యానికి పాల్పడకూడదని వారి తరఫున నా ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజు కు చేరింది.

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల 1:100 డిమాండు గల ప్రధాన కారణాలు

1) 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణాలో వచ్చిన మొట్టమొదటి గ్రూపు-1 నోటిఫికేషన్.

2) రద్దయిన గత రెండు ప్రిలిమ్స్ పరీక్షలలో క్వాలిఫై అయిన మెరిట్ అభ్యర్థులు, అవి రెండు రద్దు కావటం కారణంగా మానసికంగా తీవ్రంగా క్రుంగిపోయి ఆందోళనకరమైన వాతావరణంలో 3వ సారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవటం జరిగింది.

3)మూడవ సారి ప్రిలిమ్స్ పరీక్షకు రీ-నోటిఫికేషన్ ఇవ్వడం వలన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం వలన గత రెండు సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.

4) రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పటి వరకు నాలుగు గ్రూప్-1 నోటిఫికేషన్లు వచ్చాయి. తెలంగాణలో కూడా 4 నోటిఫికేన్లు వచ్చివుంటే తెలగాణ అభ్యర్థులకు 4 సార్లు గ్రూప్-1 పరీక్ష వ్రాసే అవకాశం వచ్చేది. వయోపరిమితి రిత్యా ఇదే మాకు చివరి అవకాశం అని గమనించగలరు.

5) గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్-1 కు మాత్రమే సిద్ధమౌతున్న అభ్యర్థులతో పాటు SSC, CGL,GROUP-2, GROUP-3, SI, CONSTABLE, వంటి వివిధ పరీక్షలకు సిరియస్ గా ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిపేరయిన అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో గ్రూప్-1 పరీక్షకు హాజరు కావడంతో ఒక కృత్రిమ వాతావరణం ప్రిలిమ్స్ పరీక్షలో పెరిగి కేవలం గ్రూప్-1 కోసమే ప్రిమేర్ అవుతున్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష వ్రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

6) తెలంగాణాలో ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాలలో వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్. దాదాపు ఇదొక సివిల్స్ నోటిఫికేషన్కి సమానంగా ఉండటం వలన లక్షల సంఖ్యల్లో గ్రామీన అభ్యర్థులు పోటీ పడటం, అరుదుగా ఇటువంటి భారి నోటిఫికేషన్ రావడం, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తెలంగాణాలో నిరుద్యోగ తీవ్రత ఎక్కువగా ఉండడం అనే అంశాలు గ్రూప్-1 మెయిన్కి 1:100 చొప్పున ఎంపిక చేయడం అనే అంశాన్ని బలపరుస్తున్నాయి.

7) గ్రూప్-1 అనేది ప్రతి సంవత్సరం UPSC మాదిరిగా నోటిఫికేషన్ రాకపోవడం ఇది రాష్ట్ర స్థాయిలో సివిల సర్వీస్ పరీక్ష కావటం, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే సర్వీసు కావడం, పుష్కర కాలం

తరువాత నోటిఫికేషన్ రావడం ద్వారా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయడం ద్వారా తెలంగాణలో

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ కలల ఉద్యోగమైన గ్రూప్1 ని సాధించే అవకాశాల సంఖ్య పెరుగుతుంది.

8) తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్-1 పరీక్షను బహిష్కరించిన అభ్యర్థులకి ప్రస్తుత నోటిఫికేషన్లో మెయిన్స్కు పరీక్షను వ్రాసి అవకాశాలు పెంచి వారి త్యాగాలను గుర్తించి వారికి

న్యాయం చేయటం ప్రభుత్వం బాధ్యత దీనికై 1:100 చొప్పున అవకాశం కల్పించడమనేది ఇప్పుడు ఆవశ్యకత అంశంగా మారింది.

9) గత రెండు సంవత్సరాల నుండి పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. వారి విలువైన డబ్బు, సమయం వృథా అయ్యాయి. దీనికి కారణం టీ.జి.పి.ఎస్.సి. నిర్వహణ లోపం మాత్రమే.

10) చాలా మంది సీనియర్ అభ్యర్థులకి వయోపరిమిత రీత్యాకూడా ఇదే చివరి అవకాశం అవ్వడం అనే అంశాన్ని కూడా పరిగణించగలరు.

1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టమా ?

1. 1:50 కి, 1:100 మధ్య మార్కుల వ్యత్యాసం 5-10 మార్కుల మధ్య ఉంటుంది. మరియు దీనివలన ఎవరికీ నష్టం లేకపోగా చాలా సంవత్సరాల నుండి గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తు సీరియస్గా ప్రిపేర్

అవుతున్న దాదాపు మరో 30 వేల మంది తెలంగాణ యువతకు మెయిన్స్ రాసే అవకాశం లభిస్తుంది.

2. ప్రిలిమినరి పరీక్ష అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇది ఒక “గేమ్ ఆఫ్ లక్” (GAME OF LUCK). ఎందుకనగా ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల అభ్యర్థుల ఎంపికలో “లక్ ఫ్యాక్టర్” (అదృష్టము) అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఒక అభ్యర్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రిలిమ్స్ పరీక్షను బట్టి పూర్తిగా

అంచనా వేయలేము. కారణం ప్రిలిమ్స్ తక్కువ మార్కులు సాధించినప్పటికి మెయిన్స్ పరీక్షలో తమ ప్రతిభతో టాపర్లుగా నిలిచిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

ఉదాహరణకు : సివిల్స్ (యుపిఎస్సీ)

అభ్యర్థి ·

పేరు

ప్రిలిమ్స్ మార్కులు

మెయిన్స్ ర్యాంకు

1. టీనా దాబి

| 82 మార్క్స్

ఆల్ ఇండియా మొదటి ర్యాంకు

(అప్పటి వాస్తవ జనరల్ కట్ ఆఫ్ మార్కులు 100+)

2. మోహితా శర్మ

| 150 మార్కులు

300 ర్యాంకు

3. రియా దాబి

| 7 మార్కులు

ఆల్ ఇండియా 15వ ర్యాంకు

పై ఉదాహరణలను గమనిస్తే ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించే

ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., గ్రూప్-1 స్థాయి అధికారుల ఎంపిక ప్రక్రియలో వారియొక్క పూర్తి సామర్థ్యాలను మెయిన్స్ పరీక్ష ద్వారా మాత్రమే వెలికితీసే అవకాశం ఉంది. (గ్రూప్-1లో) ప్రిలిమ్స్ అనేది 150 మార్కుల

ఆబ్జెక్టివ్ పరీక్ష కాగా మెయిన్స్ అనేది 900 మార్కులకు నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష.

1:100 ఎంపికకై టి.జి.పి.ఎస్.సీ. ప్రస్తుత అభిప్రాయం.

1.టిజిపిఎస్సి లాజిస్టిక్స్ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తుంది.

2.1:50 కి బదులుగా 1:100 చొప్పున పిలిస్తే పేపర్ల మూల్యాంకనముకు కాస్త ఆలస్యం అవుతుందని తద్వారా

ఫలితాలు వెల్లడించడానికి ఆలస్యం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవం : ఇక్కడ లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనే అంశాలను గమనిస్తే అభ్యర్థుల జీవితకాల అవకాశంతో

పోలిస్తే లాజిస్టిక్స్ అనే సమస్య చాలా చిన్నది.

ఇక్కడ మూల్యాంకణం అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రతి ఏడాది లక్షల మంది డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థుల

పేపర్లు 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడిస్తారు. అలాంటిది 1:100 ఎంపిక వల్ల దాదాపు 60

వేల మంది అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక అవుతారు. వారిలో చాలామంది మెయిన్స్ పరీక్షలకి హాజరు కారు.

మిగిలిన వారి పేపర్లు మూల్యాంకణం చేయడం పెద్ద సమస్య కాదు.

మెయిన్స్లో ఇంగ్లీష్ అర్హత పరీక్ష కూడా ఉండడం వల్ల ఇంగ్లీష్ పరీక్షలో అర్హత సాధించినవారి పేపర్లు

మూల్యాంకణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతిమంగా పేపర్ల మూల్యాంకణం అనేది పెద్దగా

ఆలస్యమవదు మరియు దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు.

1:100 నిష్పత్తిలో గతంలో ఎంపిక చేశారా ?

1. 1:100 ఎంపిక అనేది ప్రస్తుతం కొత్తేమీ కాదు. గతంలో వై.ఎస్.ఆర్. ప్రభుత్వ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు

1:100 చొప్పున మెయిన్కి అవకాశం కల్పించటం జరిగింది.

2. ఇటీవల ఎపిపిఎస్సీ కూడా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2లో మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో అవకాశం ఇచ్చారు.

3. తెలంగాణలో 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అప్పటి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న

ప్రస్తుత డిప్యూటి సి.ఎం. గౌ॥ మల్లు భట్టి విక్రమార్క గారు, మరియు గౌరవ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా చాలా ఎక్కువ సంవత్సరాల తరువాఈత తెలంగాణలో మొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ రావడం మరియు చాలామందికి చివరి అవకాశంగా ఉన్నందున తెలంగాణ యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం మెయిన్స్కి 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని నిండు శాసన సభలో అప్పటి ప్రభుత్వాన్ని కోరగా వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి, 1:100 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాని, కొన్ని కారణాల వల్ల అప్పటి ప్రిలిమ్స్

• రద్దవడంతో 1:100 అనే అంశం మరుగున పడిపోయింది.

• 1:100కి సమర్థన

• ఇటీవల ప్రతిపక్ష బి.ఆర్.ఎస్. & బి.జె.పి. పార్టీలు కూడా గ్రూప్-1లో 1:100 డిమాండ్ను సమర్థించి, అభ్యర్థుల

• కోరిక మేరకు వారికి 1:100 చొప్పున మెయిన్స్కి అవకాశం కల్పించి ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగ యువతకు

• మెయిన్స్ పరీక్షలు వ్రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కూడా చేశాయి.

• సుదీర్ఘ కాలం తరువాత గ్రూప్-1 నోటిఫికేషన్ తెలంగాణ యువతకు 1:100 చొప్పున అవకాశం కల్పించి తీవ్ర

• ఒత్తిడిలో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెలంగాణలోని మేధావులు, పౌరసంఘాలు,

• విద్యార్థి సంఘాలు మరియు నిరుద్యోగుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

• 1:100 వల్ల న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా?

• 1. TGPSC అనేది రాజ్యంగబద్ద సమస్య. అది స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఒక నియామక ప్రక్రియకు

• సంబంధించిన విధివిధానాలు రూపొందించడం, దానిలో మార్పులు చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది.

• ఉదాహరణకు : గ్రూప్-1 నోటిఫికేషన్లో “PARA-18” ప్రకారం నోటిఫికేషన్కి సంబంధించి మార్పులు చేర్పులు

• చేసే అధికారం, నోటిఫికేషన్ని రద్దుచేసే అధికారం / విచక్షణ కూడా టి.జి.పి.ఎస్.సి.కి ఉంటుందని అందులో

• స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ నిబంధన ప్రకారం 1:100 ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ఇచ్చే

• అధికారం TGPSCకి ఉంది. (APPSC కూడా ఇటీవల నిర్వహించిన గ్రూప్-2 మెయిన్కి 1:100 చొప్పున

• అవకాశం కల్పించింది).

• ప్రిలిమ్స్ అర్హత

• మెన్షన్ చేశారు.

• 2022లో తెలంగాణలో పోలీస్ నియామక బోర్డు (TSLPRB) విడుదల చేసిన నోటిఫికేషన్లో

• మాత్రమే జనరల్ కేటగిరీకి 40%, బి.సి.లకి 35%, ఎస్.సి., ఎస్.టి లకి 30% గా నోటిఫికేషన్లో

• కాని ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వం ఈ అర్హత మార్కులను

• జనరల్ క్యాటగిరీలో 30 శాతానికి బి.సి.లకు 25 శాతానికి, ఎస్.సి., ఎస్.టి.లకు 20 శాతానికి కట్ ఆఫ్ మార్కులను

• తగ్గించింది.

• కాబట్టి పై అంశాలనన్నింటిని పరిగణలోకి తీసుకొని, తెలంగాణ నిరుద్యోగ యువత తమ కలల ఉద్యోగమైన

• గ్రూప్-1 సాధించాలన్న ఆకాంక్షను మన్నించి, మన ప్రజాప్రభుత్వం గ్రూప్-1 మెయిన్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక

• చేసి, రద్దయిన గత రెండు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యి ప్రస్తుతం తృటిలో మెయిన్స్కీ అవకాశం కోల్పోయే పరిస్థితిలో ఉన్న సీరియస్ అభ్యర్థులకు మెయిన్స్ వ్రాసే అవకాశాన్ని కల్పించాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.

మరియు తెలంగాణలోని నిరుద్యోగుల

1. మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.

2. గ్రూప్-2లో 2000, గ్రూప్-లో 3000 ఉద్యోగాలు కలపాలి.

3.25వేల పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి – TET నార్మలైజేషన్ చేసి ఆఫ్ లైన్ లోపరీక్షలు పెట్టాలి.

4. గురుకులంలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి వారి హక్కుల కోసం పోరాడుతుంటే ఇటు TGPSC అటు మీరు గాని మొండిగా వ్యవహరిస్తున్నారు.

5. 46 GO రద్దు చేయాలి.

ఇట్టి సమస్యలను పరిష్కరించాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. లేనియెడల నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తున్నాను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular