టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి బాలకృష్ణ ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు.
ఆ తర్వాత వివిధ రకాల అంశాలప చర్చించారు. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు. మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని బాలకృష్ణ కలిశారని చెబుతున్నప్పటికీ, బసవతారకం ఆస్పత్రి విషయంలో కలిసి ఉంటారని భావిస్తున్నారు.