బాలయ్య కోసం ఓ యువ నిర్మాత సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య అందించిన సేవల్ని గుర్తు చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ సన్మాన కార్యక్రమం కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు? వస్తారు? అన్నది ఆస్కారం. ఆహ్వానాలు అందిరకీ అందుతాయి. అందుబాటులో ఉంటే అందరూ తప్పక హాజరవుతారు. ఇటీవలే బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర పరిశ్రమ తరుపున ఆయన పేరిట సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలకు సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా పలువురు హీరోలు, దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈనేపథ్యంలో మళ్లీ బాలయ్య కోసం ఏర్పాటు చేసే సన్మాన సభలో వాళ్లు కూడా పాల్గొంటే బాగు టుందని అంతా భావిస్తున్నారు. వాళ్లతో పాటు కింగ్ నాగార్జున కూడా హాజరైతే? వేదిక ఇంకా నిండుగా కనిపిస్తుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తోడైతే నందమూరి అభిమానులకు మరింత పీస్ట్ గా ఉంటుంది. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా తారక్ కూ బాబాయ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ యువ నిర్మాత ఏర్పాటు చేసే కార్యక్రమానికి తారక్ కూడా హాజరైతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తేలాల్సి ఉంది. ఒకవేళ తారక్ వచ్చానా.. నాగార్జున రావడం అయితే కష్టం అనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజమో ఈ సన్మానంలో తేలనుంది.