Friday, December 27, 2024

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

* భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
* 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం
* పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్
* 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష
* నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ
* 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్
* నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న బండి సంజయ్
*  పేద, ధనిక తేడా లేకుండా పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ దీక్ష చేపట్టేలా అన్నిరకాల ఏర్పాట్లు చేసిన కేంద్ర మంత్రి
* నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అత్యంత సుందరంగా ఆలయ ఆలంకరణ
* వెలుగు జిలుగులతో అలరారనున్న మహాశక్తి అమ్మవారి ఆలయం
* నిత్యం వేలాది మంది దర్శించుకునేలా ఏర్పాట్లు
* ప్రతిరోజు రాత్రి దాండియా ఉత్సవాలు నిర్వహించనున్న ఆలయ నిర్వాహకులు

శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. ఈరోజు నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు.

బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం 14వసారి. మహాశక్తి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆనాడుతో ఆయనతోపాటు మరో ఐదారుగురు మాత్రమే ఆనాడు దీక్ష చేపట్టారు. అధ్యాత్మకంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ భవానీ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్  ప్రోత్సహిస్తున్నారు.

ఖర్చుతో పనిలేకుండా, భవానీ దీక్ష చేపట్టాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవార్ల ఆలయంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.

బండి సంజయ్ ప్రోత్సహంవల్ల నేడు కరీంనగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా వేలాది మంది భక్తులు ‘భవానీ దీక్ష’ చేపడుతున్నారు. ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ భవానీ దీక్షను మాత్రం క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. బండి సంజయ్ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ ఈ 11 రోజులు మాత్రం భవానీ దీక్ష చేస్తున్న భక్తులతో మమేకమై ఆలయంలోనే అమ్మవారిని సేవిస్తూ నిత్య పూజలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు భవానీ దీక్ష చేపడుతున్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సైతం వారితో కలిసి భోజనం చేస్తారు.

మరోవైపు ముగ్గురు అమ్మలు కొలువైన (మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి) శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. అక్టోబర్ 3న శ్రీశ్రీశ్రీ  జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో  నుండి  శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు ప్రారంభమై విజయ దశమి వరకు  అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. భక్తులకు కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారులను ఆకర్షణీయమైన విద్యుద్దీపాల వెలుగులతో  విరజిమ్మేళ శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి  శ్రీ మహాశక్తి దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. అక్టోబర్ 3న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా, 4న శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా, 5న శ్రీ అన్నపూర్ణ (చంద్ర ఘంట) దేవిగా, 6న శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ )గా, 7న మహాచండీ దేవి (స్కంద మాత)గా, 8న శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని)గా, 9న శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి)గా,10న దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ)గా, 11న శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి)గా, విజయ దశమి పర్వదినమైన 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

మహాశక్తి అమ్మవార్ల ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులకు పలు సాంస్క్రుతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రాత్రి 9 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలు, చిన్నారులు వేల సంఖ్యలో హాజరై ఈ దాండియా ఆడుతూ ఆలయానికి వచ్చే భక్తులందరినీ అలరించనున్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com