Tuesday, May 13, 2025

బీజేపీ అధికారంలోకి వస్తే…. పాతబస్తీ రూపురేఖలు మారుస్తాం

  • హామీలిచ్చి విస్మరించిన పాలకుల గతి ఏమైందో తెలుసా కదా?
  • కాంగ్రెస్ ప్రభుత్వమైనా లాల్ దర్వాజ ఆలయానికి రూ.10 కోట్లు కేటాయించాలి
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని బంగారు బోనం సమర్పణ

బీజేపీ అధికారంలోకి వస్తే లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి ఆలయాన్ని అభివ్రుద్ధి చేయడంతోపాటు పాతబస్తీ రూపురేఖలు మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గత పాలకులు లాల్ దర్వాజ అమ్మవారికి రూ.10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని పేర్కొన్న బండి సంజయ్ అలాంటి పాలకుల గతి ఏమైందో ఆలోచించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా లాల్ దర్వాజ ఆలయ అభివ్రుద్ధికి రూ.10 కోట్లు కేటాయించాలని కోరారు. పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని బంగారు బోనం సమర్పించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు..

లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోకుంటే మనంత దురద్రుష్టవంతులు లేరు. ‘అందరం బాగుండాలే. సమాజం బాగుండాలి. దేశం బాగుండాలని’ కోరుకునే వాళ్లే నిజమైన హిందువులు. భారతీయులుగా పుట్టడం అద్రుష్టం. హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుక్రుతం. సమాజ, దేశరక్షణ కోసం మనందరం పనిచేయాలి. లాల్ దర్వాజ పవర్ ఫుల్ టెంపుల్ . ఈ టెంపుల్ అభివ్రుద్ధికి రూ.10 కోట్లు ఇస్తానని హామీనిచ్చిన గత పాలకులు ఇయ్యకపోతే ఏమైంది? ప్రభుత్వం పోయింది. అందుకే హామీలిచ్చేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచిస్తున్నా.

పాతబస్తీలోని 24 దేవాలయాల కమిటీ నిర్వహణకు రూ.5 లక్షలిస్తే.. రంజాన్ పండుగ కోసం రూ.33 కోట్లు ఇచ్చారంటే హిందువుల పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవాలి. ఈ ప్రభుత్వమైనా లాల్ దర్వాజ సింహ వాహిని ఆలయ అభివ్రుద్ధికి రూ.10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నా. అట్లాగే భక్తుల రద్దీ ద్రుష్ట్యా అమ్మవారి ఆలయ విస్తరణ కోసం పక్కనే ఉన్న ఫరీద్ మార్కెట్ ను కేటాయించాలని కోరుతున్నా. పాతబస్తీలో కబేళాలు కబ్జా అవుతున్నయ్. భూములు కబ్జా అవుతున్నయ్. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మేం అధికారంలోకి వస్తే కాశీ, అయోధ్య తరహాలో పాతబస్తీని అభివ్రుద్ధి చేసి రూపరేఖలు మారుస్తాం. సర్వేజన సుఖినోభవంతు…

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com