- వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి… రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు.ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందన్నరు. దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్ కుమార్ చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందlr, రంజాన్ కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు.. హిందువుల పండుగలంటే అంత చులకనా? బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందన్నారు. మహేశ్వరం ను ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోందని, కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నరని, బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదని, పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారన్నారు.
ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. అసైన్డు భూములను, శిఖం భూములను, దేవాదయ, అటవీ, భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దండుకున్నరని, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, ఆ వివరాలు ఎందుకు రేవంత్ సర్కారు బయట పెట్టడం లేదన్నారు. ఆ భూముల విలువ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని, కేసిఆర్ కుటుంబ సభ్యులు పెద్ధ ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదన్నారు.