Saturday, September 14, 2024

బీజేపీలోకి హరీశ్ రావు వచ్చినా.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

* బీజేపీలోకి హరీశ్ రావు వచ్చినా.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
* హరీశ్ రావుపై ప్రసంశల జల్లు కురిపించిన బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీసీనియర్ నేత బండి సంజయ్‌ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. హరీశ్‌ రావు బీజేపీలోకి వచ్చినా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఐతే హరీశ్ రావుకు ప్రజాభిమానం ఉందని, ఆయన ఈజీగా ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.
ఇక కేసీఆర్‌, కేటీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బండి సంజయ్ అన్నారు. ఐతే హరీశ్‌ రావు ఉద్యమ నాయకుడని, జనంలో ఆయనకు మంచి పేరుందని కామెంట్ చేశారు. తాను ఇలా అన్నానని హరీశ్‌ తనకు ఫోన్‌ చేశారనో, బీజేపీలో చేరుతున్నారనో అనుకోవద్దని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరాలని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉందని చెప్పిన బండి సంజయ్.. చేరమని తాము ఎవరినీ అడగడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలోకి ఏ ఎమ్యెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని తేల్చి చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular