Saturday, May 17, 2025

కేటీఆర్ ట్విట్ బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు

హర్యానా కాశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్ దే.. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఈ పరిస్థితికి కారణం.. ఆయన అహంకారపూరిత మాటలవలనే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే రకంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. కాంగ్రెస్ బీజేపీ ఒకటి కానే కాదు. దోస్తానంటే ఫోన్లలో మాట్లాడుకుంటారు మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వరు. అసలు దోస్తానంది కేసీఆర్ కాంగ్రెస్ కే…

హర్యానా కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బు సహాయం చేసింది కేసీఆర్ డబ్బుల సంచులతో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది వాస్తవ కాదా చెప్పాలి. కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ టాపింగ్ కేసు ఏమైంది. ఫోన్ టాపింగ్ కేసులో పెద్దాయన ఆదేశాల మేరకు అని క్లియర్ గా రిపోర్టు ఉంది.

ఈ రిపోర్టు ప్రకారం కనీసం కెసిఆర్ కు 41 crpc నోటీస్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు.. దీనిని బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని..మీ మధ్యలో స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ టాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించండి..సిబిఐ ద్వారా విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి..

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com