Tuesday, March 25, 2025

` బండి `కి తప్పిన ప్రమాదం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానం బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బండి సంజయ్ ఇండిగో విమానంలో బయలుదేరిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బండి సంజయ్ ఇండిగో విమానంలో బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హైదరాబాద్‌లో ల్యాండ్ చేయడం కుదరలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అర్ధరాత్రి 2.45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బండి సంజయ్ నేరుగా కరీంనగర్‌కు వెళ్లారు.
ఇదిలాఉండగా తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వండగండ్లు కూడా పడ్డాయి. ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురవటం గమనార్హం. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com