Wednesday, September 18, 2024

AirAsia Bangkok offer: బ్యాంకాక్​ ఆఫర్​ జస్ట్​ రూ.7,390కే హైదరాబాద్​ టు బ్యాంకాక్

పర్యాటకుల కోసం ఎయిరేషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి టికెట్​ను కేవలం రూ.7,390 లకే అందించనుంది. థాయ్ ఎయిరేషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్​ వెళ్లేందుకు రూ.7,390, చెన్నై నుంచి ఫుకెట్​కు రూ.6,990కే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే వైజాగ్ సహా దేశంలోని 12 నగరాలకు థాయ్​ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఈ సంస్థ, కొత్తగా హైదరాబాద్ – బ్యాంకాక్ సర్వీసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 27 నుంచి హైదరాబాద్ – బ్యాంకాక్​ సర్వీస్, చెన్నై – ఫుకెట్ సర్వీసును అక్టోబరు 30 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ప్రారంభ ఆఫర్ కింద ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లు ఎయిరేషియా.కామ్, ఎయిరేషియా మూవ్ యాప్​పై విక్రయిస్తామని థాయ్ ఎయిరేషియా వాణిజ్య విభాగాధిపతి తన్సిత గురువారం చెప్పారు. హైదరాబాద్ – బ్యాంకాక్ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై – ఫుకెట్ మధ్య 2024 అక్టోబరు 30వ తేదీ నుంచి 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. భారత ప్రయాణికులు థాయ్​ల్యాండ్ వచ్చేందుకు వీసా అవసరం లేదని, పాస్​పోర్టు ఉంటే సరిపోతుందని చెప్పారు.

AirAsia India Sale - Domestic Tickets at Rs 99 and International at Rs 444 only

99కే హైదరాబాద్​ టు బెంగళూరు: Rs 99 Air Asia Offer: Cheapest Flight Tickets In India
ఏసీ బస్సులో మన రాష్ట్రంలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతున్న నేటి సమయంలో, ఇక అంతర్రాష్ట్ర సర్వీసులు హైదరాబాద్ – బెంగళూరు అంటే ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్లిక్స్​ బస్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.99కే హైదరాబాద్‌ – బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

ప్రయాణికులకు అందుబాటు ఛార్జీలతో, స్థిరమైన రవాణాకు అంతర్జాతీయ బ్రాండ్‌గా ఉన్న ఫ్లిక్స్‌బస్‌ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్‌ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా రూ.99తో టికెట్‌ బుక్‌ చేసుకునే ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని, ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 6 మధ్య ఉండాలని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular