అందుకే ఎవరినీ పాపం అనొద్దు. పొరుగు వారే కదాని మమకారం చూపించొద్దు. పాముకు పాలు పోసి పెంచినా.. అది కాటే వేస్తుంది. బంగ్లాదేశ్ విషయంలో అదే నిజమనిపిస్తోంది. అసలు ఆ దేశం ఏర్పడిందే భారత్ దయ వల్ల. బంగ్లాదేశ్ ఇన్నాళ్లూ బతికిందే ఇండియా సాయం వల్ల. అలాంటి దాయాది దేశం.. ఇప్పుడు తోక జాడిస్తోంది. బంగ్లా భూమి ముస్లిం ఛాందసుల కదంబ హస్తాల్లోకి వెళ్లిపోయింది. హిందువులపై తీవ్ర దాడులు జరుగుతున్నాయి అక్కడ. ఏళ్లుగా కలిసున్న వారినే ఊచకోత కోస్తున్నాయి అల్లరి మూకలు. ఇస్కాన్ బాధ్యుడిని సైతం బంధించిన దుర్మార్గపు దేశం బంగ్లాదేశ్. ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక ప్రధాన సలహాదారుగా ఉన్నాడు ముహమ్మద్ యూనస్. గతంలో నోబెల్ శాంతి బహుమతి పొందని యూనస్.. ప్రస్తుతం ఆ దేశంలో హిందువులకు శాంతి అనేదే లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు అన్నాదమ్ముల్లా కలిసున్న ఇండియా, బంగ్లాలు.. ఇప్పుడు పాలి పగలతో రగిలిపోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తెంపరితనం మరింత పెరిగింది. పూర్తిగా ముస్లిం దేశంగా మారుతున్న బంగ్లాదేశ్.. సాటి ముస్లిం కంట్రీ అయిన పాకిస్తాన్‌పై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తోంది. ఇండియాతో డ్రామాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అయింది.
బంగ్లాలో ఐఎస్ఐ ఎంట్రీ..
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇటీవల పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్ దోస్తీ పెరగడం.. ఆ దేశంలో ISI ప్రభావం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాక్‌పై ఎలాంటి దాడులైనా చేస్తే.. దానికి కౌంటర్‌గా బంగ్లాదేశ్ నుంచి అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
బోర్డర్లో హైఅలర్ట్
ఇటీవల పాక్ ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్‌లో చక్కర్లు కొడుతున్నారు. ఇదే సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి యువత బుర్రల్లో ద్వేషాన్ని నింపుతున్నారు. ఇప్పటికే బెంగాల్లో జరిగిన అల్లర్లకు కారణం బంగ్లాదేశ్‌లోని రాడికల్ గ్రూప్‌లే అని అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలాంటి ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. అందుకే భారత్-బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు భారత్-మయన్మార్ సరిహద్దుల్లో కూడా భద్రతను పెంచారు.
ఇటు పాక్.. అటు బంగ్లా..
అదును చూసి బంగ్లాదేశ్ హడావుడి చేస్తుండటం ఇండియాకు ఇబ్బందికరమైన మేటరే. ఓ వైపు నుంచి పాకిస్తాన్ ఉగ్రమూకలను రెచ్చగొడుతోంది. మరోవైపు నుంచి బంగ్లాదేశ్ కూడా టెర్రరిస్టులకు డెన్‌గా మారితే.. అది భారత్‌కు మరింత సవాలే. పహల్గాం ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. నేడో రేపో సర్జికల్ స్ట్రైక్స్ తరహా అటాక్ ఉంటుందని.. పీవోకేను స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఫోకస్ అంతా పాక్‌పైనే ఉంది. ఈ సమయంలో మరో ఎండ్ నుంచి బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దువ్వితే..? ఒకేసారి రెండు దేశాలను భారత్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన సత్తా ముందు ఆ రెండు దేశాల కుప్పిగంతులు ఏం వర్కవుట్ కాకపోవచ్చు. ఒకే దెబ్బకు.. రెండు దేశాలను కొట్టేంత బలం, బలగం.. మన ఆర్మీ సొంతం.