Friday, December 27, 2024

వడ్డీ కట్టలేదు.. పొలం వేలం వేస్తాం

  • రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ
  • నిజామాబాద్ లో ఘటన

రాష్ట్రంలోని రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే.. తీసుకున్న లోన్కు వడ్డీలు కట్టలేదని వ్యవసాయ భూమి వేలానికి బ్యాంకర్లు సిద్ధమయ్యారు. దీంతో నిజామాబాద్ డీసీసీబీ బ్యాంకు అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తీసుకున్న రుణం చెల్లించలేదంటూ కామారెడ్డి జిల్లా పోల్కంపేట్‌కి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు పొలాల్లో అధికారులు వేలం నోటీసు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పొలాలు వేలం వేస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై రాసి ఉంది. ఫ్లెక్సీలతో పాటు పొలంలో ఎరుపు రంగు జెండాలను ఏర్పాటు చేశారు. ఈ వివాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఆరా తీశారు. బ్యాంకు అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి వెల్లడించారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తుండటం వల్లే అలా పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు స్పందించగా మంత్రిగా ఘాటుగా స్పందించారు. ఇలా ప్లెక్సీలు పెట్టడం లాంటి పద్ధతులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు 2010లో డీసీసీబీ (డిస్టిక్ కో – ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు)లో రూ.5లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేశాడు. భూమి మీద తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంక్ అధికారులు రైతుపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. రైతు నుంచి సమాధానం రాకపోవడంతో బహిరంగ వేలం వేస్తామని లింగంపేట ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

కాగా, ఈ వ్యవహారంపై బ్యాంకు మేనేజర్ కుమారస్వామి వివరణ ఇచ్చారు. రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలుకు బ్యాంకులో లోన్ తీసుకున్నాడని, తాము చాలాసార్లు అడిగినా కట్టలేదని, అయితే దీనిపై అతని భూమి వేలానికి వేయమని పై అధికారులు సూచించారని తెలిపారు. అందుకే అతని భూమిలో జెండాలు పాతామని, ఇటీవల కూడా అతన్ని 3గంటల లోపు డబ్బుని కట్టడానికి సమయం ఇచ్చినా చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా సగం లోన్ డబ్బులు కడితే వేలం ఆపేస్తాం అని స్పష్టం చేశారు.

కాగా, రుణం తీసుకుని పది, పదిహేను సంవత్సరాలు అయ్యి వడ్డీలు పెరిగిపోయాయని, తీసుకున్న రూ.5 లక్షలు రుణానికి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు రైతు తెలిపాడు. తాము దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నామని, భూమి చదును చేసుకోవడానికి, పైపు లైన్లు వేసుకోవడానికి తీసుకున్నామని, అప్పటి నుంచి మధ్యలో కరవు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందని, రుణాలు మాఫీ చేస్తారు అనుకున్నాం. కానీ చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వాళ్లు రుణమాఫీ చేస్తాం అని అన్నారన్నారు. అందుకే రుణమాఫీ కోసం తాము చూస్తున్నామని, ఇప్పుడు బ్యాంకు వాళ్లు వచ్చి ఎర్ర జెండాలను పాతిపెట్టారని, రుణవడ్డీలను మాఫీ చేస్తే మేము అసలు కట్టుకుంటామని – రైతులు చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com