మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ ఘోష్. తెలుగు లో మొదటి సినిమాతోనే క్యూట్ బ్యూటీ అన్న పేరు దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో అవకాశాలు అంతంత మాత్రమే అన్నట్లుగా వచ్చాయి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల విందు ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటున్న ఈ అమ్మడు తాజాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈసారి బార్బీ డాల్ అవతారంలో పాయల్ తన ఫోటోను షేర్ చేసింది. క్లోజప్ లో అందాల బార్బీ డాల్ పాయల్ యొక్క అందంకు నెటిజన్స్ కు ఫిదా అవుతున్నారు. క్లీ వేజ్ షో తో మతి పోగొడుతున్న ఈ అమ్మడిని నెటిజన్స్ ఆహా ఓహో అంటూ తెగ ప్రశంసిస్తున్నారు. పాయల్ ను ఈ మేకోవర్ లో గుర్తు పట్టలేకున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు సింప్లీ సూపర్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. పాయల్ అందాల షో కు గతంలో నెటిజన్స్ ఫిదా అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈసారి చాలా ప్రత్యేకం అన్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది.