Wednesday, October 2, 2024

ఈ రోజు నుంచే బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో ఈ రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలువుతున్నాయి. ప్రకృతిని, పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబురాలతు తెలంగాణ సిద్దమైంది. సబ్బండ వర్గాలు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూలపండగకు మహిళలు, యువతులు రేడీ అయ్యారు. దుర్గా నవరాత్రులతో పాటు కొనసాగే ఈ వేడుకలను తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు, పట్టణాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలతో పాటు పలు కాలేజీలు, పాఠశాలలో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన బతుకమ్మ పండగ నేపధ్యంలో గవర్నర్ జిష్ణిదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular