Artificial Intelligence (AI, Advanced Technology)ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ, అడ్వాన్స్ టెక్నాలజీని) వినియోగించి కేటుగాళ్లు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ మంగళవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. తాజాగా ఏఐ వాయిస్ క్లోనింగ్ విపరీతంగా పెరుగుతున్నా యన్నారు.
ఏఐ టెక్నాలజీతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు లేదా తెలిసిన వారి వాయిస్‌ను మిమిక్రీ లేదా ఇమిటేట్ చేస్తున్నారని, దీనిని ఎవరూ గుర్తుపట్టలేక పోతున్నారని సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలోనే ఏఐ వాయిస్ క్లోనింగ్‌తో జాగ్రత్త! మీ బంధువుల వాయిస్‌ను ఏఐతో ఇమిటేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, ఇలాంటి మోసాల వలలో చిక్కుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసి ఎండి సూచించారు.