Thursday, April 17, 2025

భార్యలతో జర జాగ్రత్త…. వీపు రుద్దమన్నందుకు రాడ్ తో దాడి

వీపు రుద్దమన్నందుకు ఓ మహిళ తన భర్తపై ఐరన్ రాడ్‌తో దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్ పరిధిలో ఈ ఘటన జరిగింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యలతో జర జాగ్రత్తగా ఉండాలని స్నేహితులు సరదాగా ఆట పట్టించడం మనం చూస్తుంటాం. కానీ ఈ ఘటన చూస్తే నిజంగా వారితోనే జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతోంది.

తన వీపు రుద్దాలని అడిగిన ఓ భర్తపై అతని భార్య ఇనుప రాడ్‌తో దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి నగరంలోని కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసే క్రమంలో శివ తన వీపు రుద్దాలని భార్యపై గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వింటే బాగోదని భార్య చెప్పడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

భర్తపై ఇనుప రాడ్‌తో దాడి
ఇద్దరి మధ్య గొడవ పెద్దదై పెనుగులాట జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య అక్కడే ఉన్న ఇనుప రాడ్‌తో భర్త తలపై దాడి చేసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాడ్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత చిన్న విషయానికి భర్త తలపై భార్య కొట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com