రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్‌ల్లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని.. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. సోమవారం సిద్ధిపేట మార్కెట్ యార్డ్ లో ఆయన పర్యటించారు. తడిచిన దాన్యాన్ని పరిశీలించారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, తడిచిన ధాన్యం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల నుంచి కొనుగోలు ప్రక్రియ జరగడం లేదని, కానీ, ఈ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు. అందాల పోటీలపై సీఎం రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందాల పోటీలు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు.
మార్కెట్లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉన్నాయని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారన్నారు. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు. అందాల పోటీలపై సీఎం రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందాల పోటీలు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. ధాన్యం ఐదు కిలోల తరుగు తీస్తున్నారని.. దీనిపై యాక్షన్ ఏదని అన్నారు. తాలు, తరుగు పేరిట కోతలు పెడుతున్నారని.. ప్రభుత్వం నుంచి రైతులకు దైర్యం చెప్పే మాటలు రావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్టు పెట్టీ మాట తప్పిన ఫలితమేమో ఈ అకాల నష్టం అనిపిస్తుందన్నారు. సీఎం మాట తప్పడం వల్లే ప్రకృతి పగ పట్టినట్లు కనిపిస్తోందన్నారు.
రైతుల బాధలు పట్టించుకోండి
దేశంలో అత్యధిక పంట పండిందని గొప్పలు చెప్పడం కాదని.. రైతుల బాధలు పట్టించుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. పండిన పంటను కొనక రైతులను తిప్పలు పెడుతున్నారని.. అయితే డిల్లీకి.. లేకుంటే అందాల పోటీల రివ్యూలు… అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ.. రైతుల మీద లేకుండా పోయిందన్నారు. అకాల ఈదురు గాలులు, వర్షాలకు మామిడి కాయ లేకుండా మొత్తం రాలి పోయిందని అన్నారు. పత్తి రైతుల్ని కూడా ప్రభుత్వం ముంచిందని, పత్తి రైతులకు 20 శాతం మాత్రమే ఏంఎస్‌పికి తీసుకున్నారని.. మిగతా 80 శాతం బ్రోకర్లు, ప్రైవేటు మిల్లర్ల పాలు చేశారని విమర్శించారు. దాదాపు మూడు వేల కోట్ల నష్టం రైతులకు జరిగిందన్నారు.
పత్తి రైతులకు జరిగిన అన్యాయంపై సీబీఐ చేత విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 48 గంటల్లో వడ్ల పైసలు ఇస్తున్నామని చెబుతున్న మంత్రి నిరూపిస్తారా అని సవాల్ చేశారు. పది రోజులలోపు పైసలు రాడమే లేదన్నారు. బోనస్ అని గొప్పగా చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా ఆగిపోయిందని.. తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవుడు, చర్చి, దర్గా మీద సీఎంకు నమ్మకం ఉంటే రుణ మాఫీ డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన సరిగా చేయడంలేదని, పాలన గాలిలో దీపంలా మారిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.