తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాకు బ్రేక్
రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్ తగిలింది. మద్యం ప్రియుల్లో… ప్రధానంగా యూత్ అమితంగా ఇష్టపడే బీర్లు బంద్ అయ్యాయి. యునైటెడ్ బ్రెవరీస్ సరఫరా చేసే కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపిస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిలరీస్ రేట్ల పెంపు ప్రతిపాదనలు అమోదించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రానికి బీర్లు సరఫరా చేయమంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కి యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ యాజమాన్యం లేఖ రాసింది.